కేంద్రంలో కార్మిక, కర్షకుల వ్యతిరేక పాలన
ABN , Publish Date - Jul 12 , 2025 | 11:35 PM
దే శంలోని ప్రభుత్వరంగ సంస్థలు అన్నింటిని ని ర్వీర్యం చేసిన మోడీ ప్రభుత్వం కార్మిక, కర్షకుల వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ రాములు విమర్శించారు.
అమరచింత, జూలై 12 (ఆంధ్రజ్యోతి) : దే శంలోని ప్రభుత్వరంగ సంస్థలు అన్నింటిని ని ర్వీర్యం చేసిన మోడీ ప్రభుత్వం కార్మిక, కర్షకుల వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ రాములు విమర్శించారు. శని వారం మండల కేంద్రంలోని పద్మశాలి కల్యాణ మండపంలో జరిగిన సీపీఐ మండల మహాసభ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. ఒక వైపు దేశంలో కార్మికుల, రైతుల, సా మాన్య ప్రజల వ్యతిరేక పాలన అందిస్తున్న మోదీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తయింద ని బీజేపీ నాయకులు సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ప్ర భుత్వరంగ సంస్థలను ప్రైవేటు కార్పొరేట్ కం పెనీలకు దారాదత్తం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీల అ మలుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఎ న్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చే యకుంటే సీపీఐ క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు. సదస్సులో సీపీఐ మండల, పట్టణ కార్యదర్శులు అబ్రహం, రవీం దర్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, గో పాలకృష్ణ, రమేష్, రాబర్ట్, భాస్కర్, శ్యాంసుం దర్, కుతుబ్, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.