మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలు
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:22 PM
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజలు, విద్యార్ధులు జిల్లా పోలీస్ యంత్రాంగంతో కలిసి యుద్ధం చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
గద్వాలక్రైం, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజలు, విద్యార్ధులు జిల్లా పోలీస్ యంత్రాంగంతో కలిసి యుద్ధం చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా లో మాదకద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలు నిర్వహించనున్నామని, ఇందులో భాగంగా పోలీస్ అధికారులు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో పాఠశాలలు, కళాశాలలో యువతకు, ప్రజలకు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు. ప్రతీ ఒక్కరు డ్రగ్స్, మాదక ద్రవ్యాల కు దూరంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా సమాజంలో మాదకద్రవ్యాల బారిన పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నదని అన్నారు. డ్రగ్స్ వల్ల కుటుంబాలు రోడ్డున పడిన సందర్బాలు ఎన్నో ఉన్నాయన్నారు. డ్రగ్స్‌కు, గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా జిల్లాప్రజలు డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడే ఐ యామ్ యాంటి డ్రగ్ సోల్జర్ అంటూ ఫొటో పాయింట్‌లో ఫొటో దిగి జిల్లాలోని విద్యార్థులు, యువత, పోలీస్ అధికారులు, సిబ్బంది డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలకు కలిసి రావాలని కోరారు. ఫొటో పాయింట్ వద్ద ఫొటో లు దిగి క్యూఆర్ కోడ్‌తో యాంటీ డ్రగ్ సోల్జర్ సర్టిఫికెట్స్ పొందాలని, దానికి అనుగుణంగా ప్రవర్తించాలని సూచించారు.