Share News

మరో అడుగు ముందుకు

ABN , Publish Date - Apr 09 , 2025 | 11:00 PM

గడిచిన 46 రోజులుగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగి స్తున్న 18 విభాగాలకు చెందిన రెస్క్కూ సి బ్బంది బుధవారం మరో అడుగు ముందుకే శారు.

మరో అడుగు ముందుకు
సొరంగం లోపల సహాయక చర్యలపై వివిధ బృందాలతో సమీక్షిస్తున్న ప్రత్యేక అధికారి శివశంకర్‌ లోతేటి

-ఘటనా స్థలి సమీపానికి లోకో ట్రైన్‌ పునరుద్ధరణ

- కొనసాగుతున్న శిథిలాల తొలగింపు ప్రక్రియ

- మరోసారి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రత్యేక అధికారి

నాగర్‌కర్నూల్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి) : గడిచిన 46 రోజులుగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగి స్తున్న 18 విభాగాలకు చెందిన రెస్క్కూ సి బ్బంది బుధవారం మరో అడుగు ముందుకే శారు. టన్నెల్‌ లోపలి నుంచి మట్టిని టన్నె ల్‌ బోరింగ్‌ మిషన్‌ విభాగాలను వేగంగా త రలించేందుకు కన్వేయర్‌ బెల్టును పునరు ద్ధరించి రెస్క్యూ ఆపరేషన్‌లో మరింత కద లిక తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్ర మంలో లోకో ట్రైన్‌ కూడా సంఘటన స్థలా నికి మరింత చేరువ వరకు తీసుకెళ్లగలిగితే మెరుగైన ఫలితాలు సాధించవచ్చుననే క్ర మంలో పనుల్లో వేగం పెంచారు. కన్వేయర్‌ బెల్టు పునరుద్ధరణ ప్రక్రియ ఒక వైపు కొన సాగుతుండగానే ప్రత్యామ్నాయంగా లోకో ట్రైన్‌ కూడా సంఘటన స్థలానికి సమీపం లో చేరవేయగలిగే విషయంలో విజయం సాధించారు. రెస్య్కూ ఆపరేషన్‌కు ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న శివశంకర్‌ లోతే టి ఆధ్వ ర్యంలో లోకో ట్రైన్‌ ఘటన స్థలం వరకు చేరింది. ఆ తర్వాత ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్‌ వద్ద ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో వివిధ విభాగాలకు చెందిన రెస్య్యూ అధికారులతో సమీక్ష జరిగింది. ఎంత వరకు రెస్య్కూ ఆప రేషన్‌ పూర్తి చేయగలుగుతామనే అంశంపై శివశంకర్‌ ప్రత్యేక సమాచారాన్ని తీసుకు న్నారు. ఇదే అంశాన్ని ఆయన రాష్ట్ర ప్రభు త్వానికి నివేదించనున్నారు. నేషనల్‌ ఇనిస్టి ట్యూట్‌ ఆఫ్‌ ర్యాట్‌ మైన్స్‌ సీనియర్‌ శాస్త్రవే త్త ఈసీ నవీన్‌, నీటిపారుదల శాఖ డీఈ శ్రీనివాసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అధికారి గిరిధర్‌ రెడ్డిలు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 11:00 PM