పత్తి కొనుగోలుకు మళ్లీ బ్రేక్
ABN , Publish Date - Nov 05 , 2025 | 11:24 PM
సీసీఐ కొనుగోలు కేంద్రాలు నడుస్తున్న కాటన్ మిల్లు యజమానులు తమ తమ డిమాండ్ల పరిష్కారం కోసం గురువారం నుంచి నిర వధిక సమ్మెలో పాల్గొననున్నట్లు తెలిపారు.
నిరవధిక సమ్మెలో కాటన్ మిల్లు యజమానులు
అలంపూరు చౌరస్తా, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): రైతులు పత్తిని అమ్ముకునేం దుకు నానా యాతన పడుతున్న సమయం లో పిడుగులాంటి వార్త వినాల్సివచ్చింది. సీసీఐ కొనుగోలు కేంద్రాలు నడుస్తున్న కాటన్ మిల్లు యజమానులు తమ తమ డిమాండ్ల పరిష్కారం కోసం గురువారం నుంచి నిర వధిక సమ్మెలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఉండవల్లి మండల పరిధిలోని శ్రీ వరసిద్ధి వినాయక కాటన్ మిల్లు యజమాను లు ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపా రు. సీసీఐ ఇబ్బందికర నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, రైతులు సహక రించాలని కోరారు. దీంతో ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న రైతుల పత్తి, స్లాట్ల కోసం ఎదురుచూస్తున్న రైతుల పరిస్థితి అయోమ యంలో పడింది. ఇప్పటికే వర్షాలతో సతమ తం అవుతున్న రైతులకు ఇది పిడుగులాంటి వార్తే.