Share News

రూ.6,472కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక

ABN , Publish Date - Jun 26 , 2025 | 11:18 PM

వ్యవసాయంతో పాటు ప్రాధాన్యత రంగాలకు విరివిగా రుణాలు అం దించేందుకు రూ.6,472 కోట్లతో రుణ ప్రణాళికను ఖ రారు చేసినట్లు కలెక్టర్‌ బీఎం సంతోష్‌ తెలిపారు.

 రూ.6,472కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక
బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

- బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయంతో పాటు ప్రాధాన్యత రంగాలకు విరివిగా రుణాలు అం దించేందుకు రూ.6,472 కోట్లతో రుణ ప్రణాళికను ఖ రారు చేసినట్లు కలెక్టర్‌ బీఎం సంతోష్‌ తెలిపారు. గురువారం ఐడీఓసీ హాల్‌లో డీసీసీ డీఎల్‌ఆర్సీ జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా బ్యాంకర్లు వ్యవసాయ రుణాలు, ఉపాధి యూనిట్లు, చిన్న, మధ్య తరహా, విద్య, గృహ రుణాలతో పాటు ఇతర ప్రాధాన్యత రంగాలకు, అర్హు లైన పేద ప్రజలకు రుణాలను మంజూరు చేయాల ని సూచించారు. ప్రధానమంత్రి చిన్న తరహా ఆహార వృద్ధి పథకం కింద జిల్లాలో మంజూరు అయిన 18 యూనిట్లకు 35శాతం చొప్పున రూ.27.60లక్షల సబ్సిడినీ వెంటనే విడుదల చేయాలని సూచించారు. చిన్న వ్యాపారుల రుణ దరఖాస్తులను వెంటనే ఆమోదించి రుణాలు అందించాలని సూచించారు. జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.6,472.29 కోట్లను అందించే లక్ష్యంగా కలెక్టర్‌ ప్రకటించారు. గత ఏడాది కంటే ఇది రూ.1221.21కోట్లు ఎక్కువగా లక్ష్యాన్ని కేటాయించినట్లు తెలిపారు. వార్షిక క్రెడిట్‌ ప్లాన్‌లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూ రూ.4,945.14కోట్లు ఇవ్వాలని సూచించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.606కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.192.84కోట్లు, విద్యారుణాలకు రూ.16.80కోట్లు, గృ హ రుణాలకు రూ.124.22 కోట్లు కేటాయించినట్లు క లెక్టర్‌ తెలిపారు. బ్యాంకర్లకు విధించిన టార్గెట్‌ను వం దశాతం పూర్తయ్యే విధంగా చూడాలని సూచించారు. బ్యాంకర్లు అందించే రుణాలతోనే ప్రాధాన్యత రంగాల్లో అభివృద్ధి జరిగి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రజల జీవన విధానం మెరుగు పడుతుందని ఆయ న వివరించారు. అదనపు కలెక్టర్లు నర్సింగరావు, ఎల్‌ డీఏ శ్రీనివాసరావు, నాబార్డ్‌ డీడీఎం మనోహార్‌రెడ్డి, ఆర్‌బీఐ ఏటీఎం చేతన్‌, ఇండస్ర్టీయల్‌ డీఎం రామలింగేశ్వర్‌ గౌడ్‌, బ్యాంక్‌ మేనేజర్లు పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 11:18 PM