ముగిసిన ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:21 PM
నారాయణపేట జిల్లా 2వ తేదీ నుంచి ప్రారంభమైన మక్తల్ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిసినట్లు ఆలయ ధర్మకర్త ప్రాణేషాచారీ, ఈవో కవిత తెలిపారు.
మక్తల్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా 2వ తేదీ నుంచి ప్రారంభమైన మక్తల్ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిసినట్లు ఆలయ ధర్మకర్త ప్రాణేషాచారీ, ఈవో కవిత తెలిపారు. చివరి రోజు స్వామి వారికి కల్పవృక్ష వాహన సేవ నిర్వహించినట్లు చెప్పారు. సాయంత్రం టేకు రథంపై ఊరేగించినట్లు వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. దశాబ్దాల నుంచి మరుగునపడ్డ కోనేరును మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో పునరుద్ధరించంతో భక్తులు అందులో స్నానాలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నారు.