అంగన్‌వాడీ టీచర్లకు వేసవి సెలవులు ఇవ్వాలి
ABN , Publish Date - Apr 24 , 2025 | 11:16 PM
అంగన్‌వాడీ టీచర్లకు మే నెలంతా సెలవులు ఇవ్వాలని టీచర్లు, వెల్ఫేర్ యూనియన్ నాయకులు గురువారం పట్టణంలోని మునిసిపల్ పార్కు ముందు ధర్నా నిర్వహించారు.
నారాయణపేట న్యూటౌన్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ టీచర్లకు మే నెలంతా సెలవులు ఇవ్వాలని టీచర్లు, వెల్ఫేర్ యూనియన్ నాయకులు గురువారం పట్టణంలోని మునిసిపల్ పార్కు ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు శశికళ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బల్‌రాం మాట్లాడుతూ విద్యాశాఖలో పాఠశాలలకు వేసవి సెలవులు అమలు చేస్తుండగా అదే పాఠశాల పరిధిలో పనిచేస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు లేకపోవడం సరికాదన్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడ దెబ్బతో చిన్నారులు అస్వస్థతకు గురయ్యే ప్రమాదమున్నందున కేంద్రాలకు కూడా సెలవులు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం మునిసిపల్ పార్కు ధర్నా చౌక్ నుంచి నారాయణపేట, మక్తల్, మద్దూర్ పరిధిలోని ముఖ్య నాయకులు కలెక్టరేట్‌కు వెళ్లి అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జోషి, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా నాయకురాలు పుష్ప, రాధిక, సా వితమ్మ, బుగ్గమ్మ, సుజాత, చంద్రకళ, ఉమ, మణిమాల, నారాయణమ్మ, లక్ష్మి, యశోద, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.