అపూర్వ సమ్మేళనం
ABN , Publish Date - May 25 , 2025 | 11:22 PM
అడ్డాకుల ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల 2005-06 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం సమ్మేళనం అయ్యారు.
మూసాపేట, మే 25 (ఆంధ్రజ్యోతి) : అడ్డాకుల ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల 2005-06 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం సమ్మేళనం అయ్యారు. ఈ సందర్భంగా అలనాటి మధుర జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ఇరవై ఏళ్ల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు అప్పటి ఉపాధ్యాయులు సత్యన్న, నీలకంఠం, అనంతరెడ్డి, అరుణ, సువర్ణను ఘనంగా సత్కరించారు. పూర్వ విద్యార్థులు మహేష్‌యాదవ్, కిషన్‌నాయక్, శశిధర్‌రెడ్డి, మన్నెం, ప్రవీన్, రవి, శివ, రాములు, హేమలత, సత్యమ్మ, జయమ్మ, శశిరేఖ, శోభారాణి, రాధిక, రాధ, స్వాతి, వరలక్ష్మి, రాణి పాల్గొన్నారు.
నవాబ్‌పేట : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం 2001-02 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. పూర్వ విద్యార్థులు సత్యం, రామస్వామి, ఆనంద్, నాగరాజు, భాస్కర్‌నాయక్, రాజునాయక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
చిన్నచింతకుంట : మండల కేంద్రంలోని సాందీపని పాఠశాలలో ఆదివారం 1999-2000 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు సమ్మేళనమయ్యారు. ఆనాటి గురువులైన గోపాల్‌రెడ్డి, దశరథం, చిలాల్, అజిమోద్దీన్, మార్కండేయులు, జగదీష్, స్వరుపారాణి, కట్ట గిరిజాశర్మను శాలువాతో సత్కరించారు.
మహబూబ్‌నగర్ రూరల్ : మండలంలోని మణికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999-2000 బ్యాచ్ పూర్వ విద్యార్థులు సమ్మేళనమయ్యారు. అప్పటి ఉపాధ్యాయులు నారాయణ, శంకరప్ప, నారాయణరెడ్డి, వసుంధర, కళావతి, రవికుమార్‌ను సన్మానించారు.