Share News

అదుపు తప్పిన ఎడ్లబండి..

ABN , Publish Date - Dec 21 , 2025 | 11:20 PM

ఓ రైతు తమ ఎడ్ల బండి మీద పొ లంనుంచి వడ్ల లో డ్‌తో రైస్‌ మిల్లుకు తీసుకెళ్తుండగా అదుపు తప్పి చె రువులోకి పడిపోయింది.

అదుపు తప్పిన ఎడ్లబండి..
చెరువులో పడి మృతి చెందిన ఎద్దులు

- చెరువులో పడి రెండు ఎద్దులు మృతి

అమరచింత, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఓ రైతు తమ ఎడ్ల బండి మీద పొ లంనుంచి వడ్ల లో డ్‌తో రైస్‌ మిల్లుకు తీసుకెళ్తుండగా అదుపు తప్పి చె రువులోకి పడిపోయింది. వనపర్తి జిల్లా అమరచింత మండలం నంది మల్ల గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే... గ్రామానికి చెందిన మాల నరసింహ అనే రైతు తన పొలం నుంచి 12వడ్ల సంచులను వేసుకుని నందిమల్ల పెద్ద చెరువు కట్ట మీద నుంచి బైపాస్‌ రోడ్డు మీదుగా మస్తీపూర్‌ గ్రామ రైస్‌ మిల్లుకు వెళ్తున్నాడు. చెరువు అలుగు సమీపంలో బండి దిగువకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఎద్దులు పెద్ద చెరువులోకి పడిపోయాయి. ఎద్దుల బండితో పాటు వడ్ల సంచులు రైతు సైతం పడిపోవడంతో వెంటనే తేరుకున్న రైతు బండిని వదిలి అతి కష్టం మీద ఈదుకుంటూ ప్రాణాలతో దరికి చేరుకున్నాడు. ఈ ఘటనలో చెరువులో పడిన రెండు ఎద్దులు మృతి చెందగా 80కిలోల చొప్పున ఓ సంచి మొత్తం 12వడ్లు సంచులు చెరువులో మునిగిపోయా యి. చుట్టుపక్కల రైతులు తాళ్లసాయంతో ఎద్దులను కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే నీటిలో మునిగి మృతి చెందాయి. చెరువు అడుగు భా గంలో మునిగి ఉన్న వడ్లసంచులను సైతం బయటకు తీశారు. రైతుకు లక్షా 60వేల దాకా నష్టం వాటిల్లిందని రైతు రోదిస్తూ పేర్కొన్నాడు.

Updated Date - Dec 21 , 2025 | 11:20 PM