వార్షిక ప్రణాళికను సిద్ధం చేయాలి
ABN , Publish Date - Oct 30 , 2025 | 10:44 PM
ఆయా శాఖల పురోగతికి సంబంధించిన వార్షిక ప్రణాళికను సిద్ధం చేయాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు.
- నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్
- పీఎం ధన్‌ధాన్య కృషి యోజనపై అధికారులతో సమీక్ష
నారాయణపేట, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఆయా శాఖల పురోగతికి సంబంధించిన వార్షిక ప్రణాళికను సిద్ధం చేయాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. అలాగే వచ్చే ఐదేళ్లకు సంబంధించిన ముందస్తు సమ గ్ర ప్రణాళికను తయారు చేయాలన్నారు. పీఎం ధన్‌ధాన్య కృషి యోజన అమలుకు వార్షిక ప్రణాళికను రూపొందించడంపై కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశానికి కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ హాజర య్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సహజ, సేంద్రియ వ్యవసాయాన్ని విస్త రించడం, రైతుల ఆదాయం పెంచడం, గ్రామీణ జీవనోపాధికి మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. పథకం అమలుకు అధికారులు తమ శాఖలకు సంబంధించిన అన్ని పారామీటర్లు ఉండేలా చూసుకోవాలన్నారు. బేస్‌లైన్ సర్వేలో పూర్తి వివరాలను నమోదు చేసి, వార్షిక ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. వ్యవసాయం, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, మ త్స్య, హార్టికల్చర్ శాఖల అధికారులు పూర్తి వివరాలతో సమగ్ర ప్రణాళికతో పాటు, డాక్యుమెంటరీ, పవర్ పాయింగ్ ప్రజెంటేషన్‌లను తయారు చేయాలని సూచించారు. సమావేశంలో నోడల్ అధికారి సాయిబాబా, డీఆర్‌డీవో మొగులప్ప, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, జిల్లా మత్స్యశాఖ అధికారి రహమాన్, నాబార్డ్ జిల్లా మేనేజర్ షణ్ముఖాచారి, ఎల్‌డీఎం విజయ్ కుమార్, నీటి పారుదల శాఖ ఈఈ బ్రహ్మానందరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రెడ్డి, పశు సంవర్ధక శాఖ అధికారి ఈశ్వర్‌రెడ్డి తదితరు లు పాల్గొన్నారు.