Share News

నిరంతరం ప్రజల కోసం పనిచేయాలి

ABN , Publish Date - Aug 28 , 2025 | 11:31 PM

వయసు పైబడిందని అస్త్రసన్యాసం చేయడమంటే ఆరోజే మనిషి మరణించినట్లని విరసం నాయకుడు సీ.ఎస్‌.ఆర్‌ ప్రసాద్‌ అన్నారు.

నిరంతరం ప్రజల కోసం పనిచేయాలి
సభలో మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ జీ.హరగోపాల్‌

- కనకాచారి వర్ధంతి సభలో హరగోపాల్‌, సీఎస్‌ఆర్‌ ప్రసాద్‌

పాలమూరు, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): వయసు పైబడిందని అస్త్రసన్యాసం చేయడమంటే ఆరోజే మనిషి మరణించినట్లని విరసం నాయకుడు సీ.ఎస్‌.ఆర్‌ ప్రసాద్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్‌ భవనంలో కె.వామన్‌కుమార్‌, నరసన్న అధ్యక్షతన కనకాచారి 20వ వర్థంతి సభను కేకే మెమోరియల్‌ ట్రస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సీఎస్‌ఆర్‌ ప్రసాద్‌, ప్రొఫెసర్‌ జీ.హరగోపాల్‌ పాల్గొని మాట్లాడారు. పోరాటాలు, ఉద్యమాల ద్వారా నిరంతరం ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. మనిషి ప్రాణాలు కాపాడాల్సిన రాజ్యం.. హరించే పని పెట్టుకుందని విమర్శించారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ యం.రాఘవాచారి, భీమయ్య, ఖలీల్‌, శ్రీదేవి, హనీఫ్‌అహ్మద్‌, కేసీ వెంకటేశ్వర్లు, మన్యం, బుచ్చారెడ్డి, హైమావతి, జక్కాగోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 28 , 2025 | 11:31 PM