Share News

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

ABN , Publish Date - Dec 20 , 2025 | 11:10 PM

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఉమ్మడి జిల్లా మైనారిటీ గురుకులాల రీజినల్‌ కో ఆర్డినేటర్‌ ఖాజాబహొద్దీన్‌ అన్నారు.

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
కబడ్డీలో తలపడుతున్న జట్లు

ఆర్‌ఎల్‌సీ ఖాజాబహొద్దీన్‌

ఉత్సాహంగా ఉమ్మడి జిల్లా స్థాయి మైనారిటీ గురుకులాల పోటీలు

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, జడ్చర్ల, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఉమ్మడి జిల్లా మైనారిటీ గురుకులాల రీజినల్‌ కో ఆర్డినేటర్‌ ఖాజాబహొద్దీన్‌ అన్నారు. తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలల ఆధ్వర్యంలో జడ్చర్ల మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో 3వ జోష్‌ ఉమ్మడి జిల్లా స్థాయి స్పోర్ట్స్‌ మీట్‌-2025 కొనసాగుతోంది. రెండో రోజు శనివారం పోటీలను ఖాజాబహొద్దీన్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని మైనారిటీ గురుకుల నుంచి ఆయా క్రీడా జట్లు ప్రతిభ చాటి, విజేతగా నిలవాలని ఆకాక్షించారు. వాలీబాల్‌, అథ్లెటిక్స్‌, కబడ్డీ, ఖోఖో, హ్యాండ్‌బాల్‌, చెస్‌, హాకీ, ఫుట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, టెన్నికాయిట్‌ పోటీల విజేతలకు ఆదివారం బహుమతులు ప్రదానం చేయనున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ పరిజాత, వ్యాయమ ఉపాధ్యాయుడు ఖాజాఖాన్‌, గురుకులాల ప్రిన్సిపాల్స్‌, పీఈటీలు పాల్గొన్నారు.

తొలి రోజు విజేతలు వీరే..

వాలీబాల్‌ అండర్‌-14లో మహబూబ్‌నగర్‌ బాలుర-1 జట్టు విజేతగా నిలువగా, అచ్చంపేట జట్టు రన్నర్‌గా నిలిచింది. బ్యాడ్మింటన్‌ అండర్‌-19లో నాగర్‌కర్నూల్‌ విజేతగా, అచ్చంపేట రన్నర్‌గా, ఖోఖో అండర్‌-14లో నారాయణపేట విజేతగా, మహబూబ్‌నగర్‌ బాలుర-3 రన్నర్‌గా, ఖోఖో అండర్‌-19లో మహబూబ్‌నగర్‌-1 బాలుర విజేత, నారాయణపేట రన్నర్‌గా, హ్యాండ్‌బాల్‌ అండర్‌-17లో నాగర్‌కర్నూల్‌-1 బాలుర విజేత, వనపర్తి జట్టు రన్నర్‌గా నిలిచింది.

Updated Date - Dec 20 , 2025 | 11:10 PM