చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
ABN , Publish Date - Nov 24 , 2025 | 11:42 PM
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిం చాలని డీఈవో విజయలక్ష్మి అన్నారు.
డీఈవో విజయలక్ష్మి
గద్వాల అర్బన్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిం చాలని డీఈవో విజయలక్ష్మి అన్నారు. సోమ వారం గద్వాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం గ్రౌండ్‌లో జోనల్‌స్థాయి అండర్-14 వాలీబాల్ పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ ప్రతీ క్రీడాకారుడు రా ష్ట్ర, జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. డీవైఎస్‌వో కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలు ఆడటం వల్ల భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రతీ ఒక్కరు క్రీడల్లో రాణిస్తే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని సూచించారు. ఎస్‌జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ శ్రీని వాసులు మాట్లాడుతూ గద్వాల, వనపర్తి, నాగ ర్‌కర్నూల్, నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు హాజ రయ్యారని తెలిపారు. జోనల్‌స్థాయిలో ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 26వ తేదీ నుంచి పెద్దపల్లి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. వాలీబాల్ అండర్-14 బా లుర విభాగం నుంచి నారాయణపేట జిల్లా జట్టు ప్రథమ స్థానం, జోగుళాంబ గద్వాల జిల్లా జట్టు ద్వితీయస్థానం, బాలికల విభాగం లో మహబూబ్‌నగర్ జిల్లా జట్టు ప్రథమ స్థానం, నారాయణపేట జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. విజేతలకు మెమోంటోలు అందజేశారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపా ధ్యాయులు శ్రీనివాసులు, నాగేష్‌బాబు, హైమా వతి, బీసన్న, భరత్‌కుమార్, తిరుపతి, మోహ నమురళీ, పార్వతమ్మ తదితరులు ఉన్నారు.