సోమశిలకు సినీనటుడు అల్లు అర్జున్
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:18 PM
నిత్యం సినిమా షూటింగ్‌లతో బిజీగా గడిపే ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ తన కు టుంబ సభ్యులు, చిన్ననాటి మిత్రులతో కలి సి శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూ ర్ మండలం సోమశిల గ్రామం దగ్గర కృ ష్ణానదిని గోప్యంగా సందర్శించారు.
- కుటుంబ సభ్యులు, చిన్ననాటి మిత్రులతో కలిసి కృష్ణానది అందాల వీక్షణ
- కృష్ణానదిలో బోటింగ్ చేసిన హీరో
- పుష్ప కోసం సోమశిలకు పరుగెత్తిన అభిమానులు
- అప్పటికే వెళ్లిపోయిన అల్లు అర్జున్
- రాత్రి కుడికిళ్ల గ్రామంలోని ప్రముఖ వ్యాపారవేత్త నివాసంలో బస
కొల్లాపూర్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : నిత్యం సినిమా షూటింగ్‌లతో బిజీగా గడిపే ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ తన కు టుంబ సభ్యులు, చిన్ననాటి మిత్రులతో కలి సి శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూ ర్ మండలం సోమశిల గ్రామం దగ్గర కృ ష్ణానదిని గోప్యంగా సందర్శించారు. ఆహ్లా దంగా ఉండే కృష్ణానదిలో సరదాగా బోటిం గ్ చేశారు. శనివారం సాయంత్రం 4 గంటల సమ యంలో సోమశిల గ్రామానికి అల్లు అర్జున్ తన సతీమణి, కుటుంబ సభ్యులు, చిన్ననా టి మిత్రులతో కలిసి వచ్చారు. ఎవరు గుర్తు పట్టకుండా టోపీ, మాస్క్ ధరించి సామా న్య వ్యక్తిలా నిండు కుండలా ప్రవహిస్తున్న కృష్ణానదిలో ఆహ్లాదకరంగా రెండు గంటల పాటు గడిపారు. సోమశిల గ్రామానికి పు ష్ప వచ్చాడని సోషల్ మీడియా ద్వారా తె లిసి అభిమానులు, యువకులు పెద్ద సం ఖ్యలో సోమశిల గ్రామానికి పరుగులు తీశా రు. అప్పటికే ఆయన వెళ్లిపోవడంతో అభి మానులు నిరుత్సాహం గా వెనుతిరిగారు. అల్లు అర్జున్ మాత్రం మిత్రులతో కలిసి అక్కడి నుంచి కొల్లాపూర్ మండల పరిధిలో ని కుడికిళ్ల గ్రామంలో ప్రముఖ వ్యాపార వేత్త మైహోమ్ అధినేత రామేశ్వరరావు ని వాస గృహానికి చేరుకొని అక్కడే రాత్రి బస చేశారు. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారని తెలిసింది. కుడికిల్ల గ్రామానికి అల్లు అర్జున్ వచ్చారని ఎవరికీ తెలియ కుండా గోప్యంగా ఉంచారు.