Share News

ఇరిగేషన్‌ భూమిలో హద్దులు కేటాయింపు

ABN , Publish Date - Nov 13 , 2025 | 11:16 PM

‘ఆంధ్ర జ్యోతి’ కథనానికి ఇరిగేష న్‌ అధికారులు స్పందించా రు. ‘భూ మాయ-రేకులకుంట శిఖం భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌’ శీ ర్షికన గురువారం పబ్లిష్‌ అయిన కథనంతో ఆ ప్రదేశానికి అధికారులు తరలివచ్చారు.

  ఇరిగేషన్‌ భూమిలో హద్దులు కేటాయింపు
రేకులకుంటలో హద్దులు కేటాయించి రాళ్లకు నెంబర్లు వేస్తున్న అధికారులు

- హద్దులు పెట్టకపోవడంతోనే ప్రైవేటు వ్యక్తుల సాగు

కోస్గి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్ర జ్యోతి’ కథనానికి ఇరిగేష న్‌ అధికారులు స్పందించా రు. ‘భూ మాయ-రేకులకుంట శిఖం భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌’ శీ ర్షికన గురువారం పబ్లిష్‌ అయిన కథనంతో ఆ ప్రదేశానికి అధికారులు తరలివచ్చారు. కోస్గి మండలం రేకులకుంటలో 466సర్వే నెంబర్‌లోని ఇరిగేషన్‌ శాఖకు కేటాయించిన భూమి హద్దులు ఏర్పాటు చేశారు. ఇకనుం చి ఈ భూమిలో ఎలాంటి పంట సాగు చేసినా, హద్దులు తొలగించినా సదరు వ్య క్తులపై కేసులు నమోదు చేస్తామని ఇరిగేషన్‌ డీఈ ఆనంద్‌ కిశోర్‌, ఏఈలు నిర్మల, పవన్‌కుమా ర్‌ రెడ్డి హెచ్చరిం చారు.గతంలో హ ద్దులు లేకపోవడం తోనే ప్రైవేటు వ్యక్తు లు ఈ భూమిని సా గు చేశారని పేర్కొన్నారు.

రెవెన్యూ రికార్డు ప్రకారం పట్టాచేశాం

మోకాపై భూమిలేకున్నా మా దగ్గర ఉన్న రెవెన్యూ రికార్డు ప్రకారం పట్టా చేశాం. 466లో మొత్తం భూమి 10 ఎకరాల 38 గుంటల భూమి ఉంది. అందులో ఇరిగేషన్‌ శాఖకు 2ఎకరాల 29 గుంటల భూమి ఉంది. అయితే మిగిలిన 8ఎకరాల 9గుంటలు పట్టాకాని మోకాపై భూమి తక్కువగా ఉన్నా తమకు సంబంధం లేదు. యథావిధిగా రికార్డు ప్రకారం రిజిస్ర్టేషన్‌ చేస్తాం.

- శ్రీనివాసులు, తహసీల్దార్‌

Updated Date - Nov 13 , 2025 | 11:16 PM