ఏటీసీలో అన్ని పనులు త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:13 PM
అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌లో పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు సూచించారు.
- పెండింగ్ పనులను పరిశీలించిన గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌లో పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు సూచించారు. త్వరలో తరగతులను ప్రారంభిస్తామని తెలిపారు. మంగళవారం ఆయన శెట్టిఆత్మకూర్ రోడ్‌లోని ఏటీ సెంటర్‌ను తనిఖీ చేశారు. ప్రభుత్వం అధునాతన టెక్కాలజీ సెంటర్ల ద్వారా యువతకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు కృషి చేస్తున్నదని వివరించారు. పెండింగ్‌లో ఉన్న పనులను పరిశీలించారు. ఈనెల 20వ తేదీ నాటికి పూర్తి చేసి, తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట సహాయ లేబర్ కమిషనర్ మహేశ్‌కుమార్, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ వైస్ ప్రిన్సిపాల్ సలీం తదితరులు ఉన్నారు.