పత్తి అంతా అయిపోయింది
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:15 PM
సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఇప్పుడు ప్రారంభిస్తే రైతులకు ఉపయోగం లే దని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.
సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఇప్పుడు ప్రారంభిస్తే రైతులకు ఉపయోగం లే దని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శనివా రం గద్వాల పట్టణంలో సీసీఐ కొనుగోలు కేం ద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. నెల రో జుల నుంచి పత్తి విక్రయాలు జరుగుతుండగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఇప్పుడు ప్రారంభిస్తే ఏమి ప్రయోజనమని ప్రశ్నించారు. ఇప్పటికే కొనుగోలు చేసిన దళారులు కపాస్ కిసాన్ యాప్‌ను ఉపయోగించి ఎక్కువ ధరకు విక్రయించి లాభం పొందుతారని విమర్శించారు. తేమ 12శాతం కంటే తక్కువగా ఉండాలని సీసీఐ నిబంధనలు పెట్టిందని ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తేమ అధికంగానే ఉంటుంద న్నారు. ఇలాంటి నిబంధనలతో రైతులు ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, మా ర్కెట్ చైర్మన్ కుర్వ హనుమంతు, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, విజయ్‌కుమార్, కొత్తపల్లి మహేశ్వర్‌రెడ్డి, పటేల్ ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.