హిందువులంతా సంఘటిత శక్తిగా మారాలి
ABN , Publish Date - Dec 25 , 2025 | 11:46 PM
హిందువులందరూ సంఘటిత శక్తిగా మారితేనే జిహాదీలకు గుణపాఠం నేర్పగలమని వీహెచ్ పీ జిల్లా అధ్యక్షుడు అల్లూరి ఫణిమోహన్ రావు అన్నారు.
గద్వాల టౌన్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): హిందువులందరూ సంఘటిత శక్తిగా మారితేనే జిహాదీలకు గుణపాఠం నేర్పగలమని వీహెచ్ పీ జిల్లా అధ్యక్షుడు అల్లూరి ఫణిమోహన్ రావు అన్నారు. బంగ్లాదేశ్‌లో దీప్‌చంద్‌దాస్ హత్యను నిరసిస్తూ గురువారం రాత్రి వీహెచ్‌పీ ఆధ్వ ర్యంలో పట్టణంలో నిరసన తెలిపారు. ఈసం దర్బంగా మాట్లాడిన ఫణిమోహన్ రావు, బం గ్లాదేశ్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దా డులు, అకృత్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.అకృత్యాలను అరిక్టడంలో అక్కడి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించా రు. హిందులందరూ ఏకమై జిహాదీలకు గుణ పాఠం నేర్పాలన్నారు. హత్యకు పాల్పడిన బంగ్లాదేష్ జిహాదీల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్, బీజేపీ నాయకులు తి రుపతి, మణి, జగదీశ్వర్‌రెడ్డి, భాస్కర్, మనోజ్, రామాంజనేయులు, బండల వెంకట్రాములు, నరసింహులు ఉన్నారు.