Share News

అన్ని వసతులు కల్పించాలి : కలెక్టర్‌

ABN , Publish Date - Jun 19 , 2025 | 10:50 PM

ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ నిర్వాసిత కుటుంబాలకు ఆర్‌ఆర్‌కింద కేటాయించే స్థలంలో వసతులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ విజయేందిర బోయి సంబంధిత అధికారులను ఆదేశించారు.

అన్ని వసతులు కల్పించాలి : కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయేందిర బోయి

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి) : ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ నిర్వాసిత కుటుంబాలకు ఆర్‌ఆర్‌కింద కేటాయించే స్థలంలో వసతులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ విజయేందిర బోయి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరెట్‌లోని సమావేశ మందిరంలో రెవెన్యూ, ఇరిగేషన్‌, సర్వేల్యాండ్‌ రికార్డ్స్‌, సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ కింద వల్లూరు, ఉదండాపూర్‌, తుమ్మలకుంట తండా, రేగడిపట్టితండా, చిన్నగుట్టతండా, శామగడ్డ తండా, ఒంటిగుడిసెతండా, పోలేపల్లి వ్యవసాయ క్షేత్రంలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు, అవార్డు అందుకున్న వారందరికీ పునరావాసం కింద 300 గజాల స్థలం త్వరితగితిన పూర్తి చేయాలని ఆదేశించారు. అక్కడ నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌, అంగన్‌వాడీ, ఫంక్షన్‌ హాల్‌ వంటి ఇతర మౌలిక సదుపాయాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 10:50 PM