Share News

పాలమూరులో అలర్ట్‌

ABN , Publish Date - Nov 10 , 2025 | 11:03 PM

ఢిల్లీలో బాంబుపేలుళ్ళతో పాలమూరులో పోలీస్‌ శాఖ అలర్ట్‌ అయ్యింది. ఎస్పీ జానకి ఆదేశాల మేరకు పోలీసులు వా హనాల తనిఖీలను ముమ్మరం చేశారు.

పాలమూరులో అలర్ట్‌
మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేస్తున్న పోలీసులు

ఢిల్లీలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో వాహనాల తనిఖీలు

మహబూబ్‌నగర్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో బాంబుపేలుళ్ళతో పాలమూరులో పోలీస్‌ శాఖ అలర్ట్‌ అయ్యింది. ఎస్పీ జానకి ఆదేశాల మేరకు పోలీసులు వా హనాల తనిఖీలను ముమ్మరం చేశారు. జిల్లాలోని అన్ని పోలీ స్‌ స్టేషన్ల పరిధిలోని సున్నిత ప్రాంతాలపై దృష్టి సారించారు. నగరంలోని వన్‌టౌన్‌, రూరల్‌, టూటౌన్‌ పోలీసులతోపాటు జడ్చర్ల పోలీసులు సోమవారం రాత్రి పలు కూడళ్లలో వా హనాలను తనిఖీ చేశారు. పోలీసులంతా అప్రమత్తంగా ఉం టూ అనుమానాస్పద ప్రాంతాలు, వ్యక్తులపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో మంగళవారం ఉప ఎన్నికలు ఉండటంతో ఇప్పటికే కొందరు పోలీసులు బందోబస్తుకు వెళ్లారు. మిగతా వారికి సెలవులు ఇవ్వకూడదని, అందరూ విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

Updated Date - Nov 10 , 2025 | 11:03 PM