ఘనంగా అలయ్ బలయ్
ABN , Publish Date - Oct 05 , 2025 | 11:27 PM
అలయ్ బలయ్ వేడుకలు ఐకమత్యానికి ప్రతీక అని మహబూబ్‌నగర్ మునిసిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌కుమార్ గౌడ్ అన్నారు.
మహబూబ్‌నగర్ న్యూటౌన్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : అలయ్ బలయ్ వేడుకలు ఐకమత్యానికి ప్రతీక అని మహబూబ్‌నగర్ మునిసిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం పట్ణణంలోని గడియారం చౌరస్తాలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షడు సీమ నరేంద్ర ఆధ్వర్యంలో అలయ్ బలయ్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో పార్టీలకు, మతాలకు అతీతంగా పలువురు పెద్దలు పాల్గొని ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఆనంద్‌గౌడ్ మాట్లాడుతూ అయ్యప్ప దీక్ష ప్రచార సమితి 1999 నుంచి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములకు అల్పాహారం అందించడంతో పాటు భోజన సౌకర్యం కూడా కల్పించారన్నారు. అదే స్ఫూర్తితో నేడు రాజకీయాలకు, మతాలకు అతీతంగా పాలమూరు పట్టణంలో ప్రజలను ఏకతాటి తెచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషకరంగా ఉందన్నారు. పట్టణంలో మొదటిసారిగా చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తిని ప్రతీ సంవత్సరం కొనసాగించాలని నిర్వాహకులను కోరారు. ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, కాంగ్రెస్ నాయకులు సురేందర్‌రెడ్డి, వెంకటేష్, సంజీవ్ ముదిరాజ్, మిథున్‌రెడ్డి, మద్ది యాదిరెడ్డి, రాజ్‌దేశ్ పాండే, రమేష్, రఘురాంగౌడ్, సంతోష్, నరసింహారావు, రామచంద్రయ్య, శివ, అరుణ్ పాల్గొన్నారు.