Share News

బహుజనుల ఆత్మగౌరవ ప్రతీక ఐలమ్మ

ABN , Publish Date - Sep 26 , 2025 | 11:40 PM

తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో చాకలి ఐలమ్మ విశిష్టమైన పాత్ర పోషించి, మహిళా చై తన్యం, ధైర్యసాహసాలు, బహుజన ఆత్మగౌరవానికి శాశ్వత ప్రతీకగా నిలిచారని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

బహుజనుల ఆత్మగౌరవ ప్రతీక ఐలమ్మ
గద్వాల కలెక్టరేట్‌లో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌ సంతోష్‌, అధికారులు

గద్వాలన్యూటౌన్‌,సెప్టెంబరు26(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో చాకలి ఐలమ్మ విశిష్టమైన పాత్ర పోషించి, మహిళా చై తన్యం, ధైర్యసాహసాలు, బహుజన ఆత్మగౌరవానికి శాశ్వత ప్రతీకగా నిలిచారని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాల య ఆవరణలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె చిత్రపటానికి కలెక్టర్‌ బీఎం సంతోష్‌ ఘ నంగా నివాళిఅర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, డీపీ వో నాగేంద్రం, ఏవో భూపాల్‌రెడ్డి, అధికారులు, సిబ్బంది ఉన్నారు.

  • జిల్లా పోలీస్‌ కార్యాలయంలో..

గద్వాల క్రైం: జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఐలమ్మ తె లంగాణ సాయుధ పోరాటం మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శంకర్‌, సాయుధ దళ డీ ఎస్పీ నరేందర్‌రావు, కార్యాలయ ఏవో సతీష్‌కుమార్‌, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఐ వెం కటేశ్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 11:40 PM