Share News

ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ బోధన

ABN , Publish Date - Mar 13 , 2025 | 11:28 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా పె ద్దకొత్తపల్లి మండలంలోని చంద్రకల్‌ ప్రాథమిక పాఠశాలలో 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఏఐ బోధన ఏర్పాట్లను డీఈవో ఏ.ర మేష్‌కుమార్‌ గురువారం పరిశీలించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ బోధన
చంద్రకల్‌ ప్రాథమిక పాఠశాలలో ఏఐ బోధన ముందస్తు తరగతులను పరిశీలిస్తున్న డీఈవో రమేష్‌కుమార్‌

- రేపటి నుంచి ప్రారంభించనున్న మంత్రి జూపల్లి

- ఏర్పాట్లను పరిశీలించిన డీఈవో

పెద్దకొత్తపల్లి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ జిల్లా పె ద్దకొత్తపల్లి మండలంలోని చంద్రకల్‌ ప్రాథమిక పాఠశాలలో 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఏఐ బోధన ఏర్పాట్లను డీఈవో ఏ.ర మేష్‌కుమార్‌ గురువారం పరిశీలించారు. ఏఐ బోధనకు సిద్ధం చేసిన కంప్యూటర్లను తనిఖీ చేశారు. విద్యార్థులతో గణిత, తెలుగు పాఠాల ను కంప్యూటర్‌ ద్వారా బోధన పద్ధతులను చూశారు. డీఈవో మాట్లా డుతూ నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు ద్వారా 13 ప్రాథమిక పాఠశాలల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) బోధన తరగతులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. చంద్రకల్‌ ప్రాథమిక పాఠశాలలో ఏఐ తరగతులను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నట్లు పేర్కొ న్నారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లను పక్కాగా నిర్వహించాలని పా ఠశాల హెచ్‌ఎంను డీఈవో ఆదేశించారు. కంప్యూటర్లు , అందుకు కా వాల్సిన ఎలకా్ట్రనిక్‌ పరికరాలతోపాటు పూర్తిస్థాయిలో ఇంటర్నెట్‌ సౌక ర్యం తదితర ఏర్పాట్లును పక్కాగా చేసుకోవాలని సూచించారు. పెద్ద కొత్తపల్లి మండలంలో పైలెట్‌ ప్రాజెక్టు ద్వారా చంద్రకల్‌, గంట్రా వుపల్లి ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. డీఈవో వెంట జిల్లా అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి షర్ఫుద్దీన్‌, ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 11:28 PM