రాష్ట్రంలో పండుగలా వ్యవసాయం
ABN , Publish Date - Jul 07 , 2025 | 11:35 PM
రాష్ట్రంలో వ్యవసాయా న్ని పండుగ చేసిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వానిదేనని రెవెన్యూ, గృహ నిర్మా ణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- పేదలను అక్కున చేర్చుకున్న ప్రజా ప్రభుత్వం
- ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
- చెంచులకు ఇందిరమ్మ గృహ అనుమతి పత్రాల పంపిణీ
మన్ననూర్/ అచ్చంపేట, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో వ్యవసాయా న్ని పండుగ చేసిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వానిదేనని రెవెన్యూ, గృహ నిర్మా ణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూలు జిల్లా, అమ్రాబాద్ మండలంలోని మన్ననూరులో సోమవారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటితో పాటు, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం అమ్రాబాద్ ప్రధాన రహదారి నుంచి ప్రశాంత్‌నగర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గిరిజన భవన్ ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఇందిరమ్మ గృహ నిర్మాణ అనుమతి పత్రాలను చెంచులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలో 27 వేల ఆదివాసీ, చెంచు గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రైతులకు రూ. 17 వేల కోట్ల రుణాలను మాఫీ చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే రూ. 21 వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘనత తమదేనన్నారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ పేదలను అక్కున చేర్చుకొని, వారి అవసరాలను తీరుస్తున్నది ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వమేన న్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల మంజూ రుకు ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దని, ఎవరైనా అడిగితే తనకు నేరుగా ఫిర్యాదు చేయాలన్నారు. నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తున్నా మని, దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ మంత్రి చేతుల మీదుగా 536 మందికి ఇళ్ల పట్టాలను అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, ఐటీడీఏ పీవో రోహిత్ గోపిడి, ఆర్డీవో మాధవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దాసరి శ్రీనివాసులు, నాయకులు పాల్గొన్నారు.