ఇక అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు
ABN , Publish Date - Mar 13 , 2025 | 11:11 PM
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ నియోజకవర్గాలలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను(ఏటీసీ) ఏర్పాటు చేయాలని సంకల్పించిందని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్‌కుమార్ వెల్లడించారు.

రాష్ట్ర ఉపాధి కల్పనాధికారి కలెక్టర్లతో సమీక్ష సమావేశం
గద్వాల న్యూటౌన్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ నియోజకవర్గాలలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను(ఏటీసీ) ఏర్పాటు చేయాలని సంకల్పించిందని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్‌కుమార్ వెల్లడించారు. గురువారం ఆయన కలెక్టర్లతో వర్చువల్ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటికే రాష్ట్రంలో 70ఏటీసీ కేంద్రాల నిర్మాణాలు వివి ధ దశల్లో కొనసాగుతున్నాయన్నారు. ఇదే తరహాలో ఐటీసీ, ఏటీసీ సెంటర్లు లేని ప్రతి గ్రామీ ణ ప్రాంత అసెంబ్లీ సెగ్మెంట్‌లో కనీసం ఒకటి చొప్పున అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పా టు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఏటీసీ సెంటర్లు నిర్మాణానికి అనువైన ప్రదేశం, స్ధలాన్ని గుర్తిస్తూ సమగ్ర వివరాలతో కూడిన నివేదికలను త్వరితగతిన సమర్పించాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో సుమారు 45ఏటీసీ కేంద్రాలను గ్రామీ ణ ప్రాంత నియోజకవర్గాలలో నెలకొల్పాలని ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. రోడ్డు, రవాణా వసతితో పాటు సమీపంలో పరిశ్రమలు ఉన్న స్థలాలను ఎంపిక చేస్తే ఏటీసీ కేంద్రాల్లో విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు, ఇన్‌స్ట్రక్టర్లు సులు వుగా రాకపోకలు సాగించేందుకు వీలుంటుంద ని సూచించారు. ఏటీసీ సెంటర్ల ద్వారా శిక్షణ పూర్తిచేసుకున్న వెంటనే యువతకు స్థానిక పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు లభించేందుకు దోహదపడినట్లు అవుతుందన్నారు. అనంతరం కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ జిల్లాలోని అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏటీసీ కేంద్రాల ఏర్పాటుకు మూడు ఎకరాల స్థలాన్ని గుర్తించామని, పూర్తివివరాలతో కూడిన నివేదికను సోమవారంలోపు పంపిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, సంబంధిత అధికారులు ఉన్నారు.