ఘనంగా ఆదిశంకరాచార్యుల జయంతి
ABN , Publish Date - May 02 , 2025 | 11:27 PM
ఆదిశంకరాచార్యుల జయంతిని శుక్రవారం జడ్చర్లలో ఘనంగా నిర్వహించారు.
జడ్చర్ల, మే 2 (ఆంధ్రజ్యోతి) : ఆదిశంకరాచార్యుల జయంతిని శుక్రవారం జడ్చర్లలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయం, పాతబజారు శివాలయంలో బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో గణపతిపూజ, రుద్రాభిషేకం, అదిశంకరులకు పాదుకాభిషేకం, అష్ఠోత్తరపూజతో పాటు మహామంగళహరతి నిర్వహించారు. పాతబజారు శివాలయంలో ఆదిశంకరాచార్యుల విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు నరేంద్రశర్మ, రాఘవేంద్రరావు, సుమన్, భార్గవశర్మ, నరసింహరావు, ప్రవీణ్, రంజిత్‌బాబు, దత్తుకుమార్, పురుషోత్తం, అంబి, రాఘవేందర్‌రావు, ప్రసన్న, లక్ష్మీ, జ్యోతి, మాధవి, రాధాకృష్ణ పాల్గొన్నారు.
కోయిలకొండ : మండలంలోని అభంగపట్నం గ్రామంలో ఆది శంకరాచార్య ఆలయంలో శంకర జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫల పంచామృతాభిషేకం, రుద్రహోమ పూజలు జరిపించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వాములచే ప్రవచనం, హరినామ సంకీర్తన భజనలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. శేఖర్‌స్వామి, నామాల వెంకటయ్య, వందిరి శేఖర్‌స్వామి, వెంకటయ్య, వీరన్న, రంగయ్య, సుధాకర్‌స్వామి, ప్రభాకర్ గురుస్వామి, వాసుదేవ్, శంకర్, కేశవులు పాల్గొన్నారు.