కావాల్సినంత యూరియా అందించాలి
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:31 PM
రైతులకు కావాల్సినంత యూరియాను తక్షణమే అందించాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ న్‌రెడ్డి అన్నారు.
- మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మక్తల్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : రైతులకు కావాల్సినంత యూరియాను తక్షణమే అందించాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ న్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పట్టణం లోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావే శంలో మాట్లాడారు. ప్రభుత్వం ముందుచూ పుతో బఫర్ నిల్వలు ఉంచుకోవడంతోనే సమ స్య ఏర్పడిందన్నారు. రైతులు రెండు మూడు సార్లు కేంద్రాల వద్దకు వెళ్లి క్యూలో నిలబడితే తప్పా యూరియా దొరకని పరిస్థితి ఏర్పడిం దన్నారు. నియోజకవర్గంలో సాగు గణనీ యంగా పెరిగిందన్నారు. సరైన నిల్వలు ఉంచు కోకపోవడంతో కొరత ఏర్పడిందన్నారు. రైతుల కు 12లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉండగా ఇప్పటి వరకు 3,847ట న్నుల యూరియా అందించారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతు లకు యూరియా అందించాలని, మరోసారి ఇలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసు కోవాలన్నారు. భూ నిర్వాసితులకు నల్లగొండ జిల్లాలో ఎకరాకు రూ.25లక్షలు ఇచ్చి మక్తల్ నియోజకవర్గంలో రూ.14లక్షలు ఇస్తామనడం ఏమిటన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండ ల అధ్యక్షుడు చిన్న హన్మంతు, మొగిలప్ప, అన్వర్ హుసేన్, మన్నాన్, శివారెడ్డి, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.