Share News

గ్రామాల అభివృద్ధి చూసే కాంగ్రెస్‌లో చేరికలు

ABN , Publish Date - Dec 05 , 2025 | 11:13 PM

రాష్ట్రంలోని అన్ని నియోజవర్గాల్లోని గ్రామాల సమగ్ర అభివృద్ధి ఒక్క కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అన్నారు.

గ్రామాల అభివృద్ధి చూసే కాంగ్రెస్‌లో చేరికలు
నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న సంపత్‌కుమార్‌

  • ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌

వడ్డేపల్లి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని అన్ని నియోజవర్గాల్లోని గ్రామాల సమగ్ర అభివృద్ధి ఒక్క కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అన్నారు. ఈక్రమంలో పార్టీ అమలు చేస్తున్న సం క్షేమ పథకాలు, అభివృద్ధితోనే పలువురు నాయకులు పార్టీలోకి చేరుతున్నారన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం చాగాపురం గ్రామానికి చెందిన పరశురాముడతో పాటు 40మంది బీజేపీ నాయకు లు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. శు క్రవారం శాంతినగర్‌లోని పార్టీ క్యాంప్‌ కార్యా ల యంలో సంపత్‌కుమార్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ సర్పంచు ఎన్నిక ల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త, నాయకుడు పని చేయాలన్నారు. సర్పంచులను అత్యధిక స్థా నాల్లో గెలిపించాలని చెప్పారు. కార్యక్రమంలో ఇటిక్యాల మండల అధ్యక్షుడు రుక్మానందరెడ్డి, గ్రామకమిటీ సభ్యులు చాంద్‌, లింగన్న, అల్లాబ కాస్‌, ఆంజనేయులు, గొల్ల రామకృష్ణ, గోవర్ధన్‌, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - Dec 05 , 2025 | 11:13 PM