గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలి
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:32 PM
రాను న్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచు కొని గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు చెప్పారు.

బీజేపీ జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు
అలంపూరు, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): రాను న్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచు కొని గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు చెప్పారు. గావ్ చలో- బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా బుధవారం అలంపూరులోని హరిత టూరిజం హోటల్‌లో మండల అధ్యక్షుడు గొంగ ళ్ల ఈశ్వర్ అధ్యక్షతన మండల కార్యవర్గ సమా వేశం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనే యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ను దృష్టిలో ఉంచుకొని గెలుపే లక్ష్యంగా వార్డు మెంబర్లు, సర్పంచు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు కై వసం చేసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి లబ్ధిపొందేలా అవ గాహన కల్పించాలని, అలాగే రానున్న అంబేడ్క ర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని పిలు పునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ స భ్యులు నాగేశ్వర్‌రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ రం గస్వామి, స్టేట్ ఓబీసీ మోర్చా ప్రోగ్రాం నాగమ ల్లయ్య, మాజీ మండల అధ్యక్షుడు జగన్‌మోహ న్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మధురవాణి రెడ్డి, రాజశేఖర్, రవికుమార్, సుధాకర్‌యాదవ్, దానారెడ్డి, బాలకృష్ణారెడ్డి, సాయిబాబ, భాస్కర్ పాల్గొన్నారు.