‘కార్యకర్తలే నాబలం.. నా బలగం’
ABN , Publish Date - Jul 04 , 2025 | 11:39 PM
పార్టీకి పట్టుగొమ్మలైన కార్యకర్తలే నాబలం.. నాబలగం అని వ నపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అ న్నారు.
వనపర్తి టౌన్, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : పార్టీకి పట్టుగొమ్మలైన కార్యకర్తలే నాబలం.. నాబలగం అని వ నపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అ న్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ని ర్వహిస్తున్న గ్రామ కమిటీ అధ్యక్షులు, క్రియాశీల కార్యకర్తల సమ్మేళన సభకు కార్యకర్తలు, నాయకులతో పాటు ప్రత్యే కంగా ఏర్పాటు చేసుకున్న ఆర్టీసీ బస్సులో బ యలుదేరి వెళ్లారు. బస్సులను జెండా ఊపి ప్రా రంభించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేది కార్యకర్తలేనని, అలాంటి కార్యకర్తలతో జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమ్మేళన సభ ఏ ర్పాటు చేయడం పార్టీకి ఎంతో ముఖ్యమన్నారు. బండారు శ్రీనివాస్‌గౌడ్, సతీష్, రమేష్, బ్రహ్మం చారి తదితరులు హైదరాబాద్ వెళ్లిన వారిలో ఉన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కా ర్యాలయం నుంచి జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్ర సాద్, చీర్ల జనార్దన్, కిరణ్‌కుమార్ తదితరులు హైదరాబాద్ వెళ్లారు.