Share News

చురుకుగా చెక్‌డ్యాం నిర్మాణ పనులు

ABN , Publish Date - Jul 20 , 2025 | 11:30 PM

మండలంలోని తిరుమలాపూర్‌, చిన్నచింతకుంట గ్రామాల మధ్య గల ఊకచెట్టు వాగులో చేపట్టిన చెక్‌డ్యాం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

చురుకుగా చెక్‌డ్యాం నిర్మాణ పనులు

- పెరగనున్న భూగర్భ జలాలు

- ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు

చిన్నచింతకుంట, జూలై 20 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని తిరుమలాపూర్‌, చిన్నచింతకుంట గ్రామాల మధ్య గల ఊకచెట్టు వాగులో చేపట్టిన చెక్‌డ్యాం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దాదాపు రూ.15 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ పనులు 80శాతం వరకు పూర్తి కాగా, ఇంకా రివిట్మెంట్‌ తదితర పనులు జరగాల్సి ఉంది. ఇప్పటికే సీసీ పనులు పూర్తి అయ్యాయి. కోయిల్‌సాగర్‌ దిగువన గల ఊకచెట్టు వాగులో భూగర్భ జలాలను ఒడిసి పట్టేందుకు దేవరకద్ర మండలంలోని చినరాజమూర్‌, పెద్దరాజమూర్‌, బస్వాపూర్‌, గురకొండ, పెద్దగోప్లాపూర్‌, చిన్నచింతకుంట మం డలంలోని బండరుపల్లి, లాల్‌కోట, పల్లమరి, ముచింతల, నెల్లికొండి, ఏదులాపూర్‌, చిన్నచింత కుంట, కురుమూర్తి, అల్లిపూర్‌ గ్రామాల్లోని వా గులో జోరుగా చెక్‌డ్యాం నిర్మాణాలు జరిగాయి. ఈ చెక్‌డ్యాం నిర్మాణాల కారణంగా దాదాపు ఐదు కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగి సాగు, తాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదపడుతున్నాయి.

Updated Date - Jul 20 , 2025 | 11:30 PM