Share News

సీఎం పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు

ABN , Publish Date - Jul 15 , 2025 | 11:53 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు చురు కుగా సాగుతున్నాయి.

సీఎం పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు
సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- ఈ నెల 18న రానున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

- జటప్రోలులో 70 వేల మందితో భారీ బహిరంగ సభ

- ముఖ్య నాయకులతో మంత్రి జూపల్లి సన్నాహక సమావేశం

- ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, కలెక్టర్‌, ఎస్పీ

కొల్లాపూర్‌/ పెంట్లవెల్లి, జూలై15 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు చురు కుగా సాగుతున్నాయి. కొల్లాపూర్‌ నియోజకవర్గ పరిధి లోని పెంట్లవెల్లి మండలం, జటప్రోలు గ్రామానికి ఈ నెల 18వ తేదీన సీఎం రానున్నారు. అందుకు సంబం ధించిన ఏర్పాట్లను పర్యాటక, ఎక్సైజ్‌, సాంస్కృతిక పురా వస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో కలెక్టర్‌ బాదావత్‌ సంతోశ్‌, ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ పర్యవేక్షిస్తున్నారు. పర్యటనలో భాగంగా జట ప్రోలులో రూ. 200 కోట్ల వ్యయంతో ‘యంగ్‌ ఇం డియా ఇంటిగ్రేటెడ్‌ సమీకృత గురుకుల పాఠశాల’ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నా రు. గ్రామంలోని మదన గోపాలస్వామి ఆలయం పరి సరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి మం డలానికి 10 వేల మంది చొప్పున 70 వేల మందిని రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వారిలో 30వేల మంది మహిళలు ఉండేలా కార్యాచరణ ఉండా లని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. సభ నిర్వహణపై వనపర్తి జిల్లా, కొత్తకోట సమీపంలోని ఓ ప్రైవేటు ఫామ్‌ హౌస్‌లో మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి, కలెక్టర్‌, ఎస్పీలతో కలిసి జటప్రోలు గ్రామంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలి సారి కొల్లాపూర్‌ నియోజకవర్గానికి వస్తున్నారని, ఎలాం టి లోటుపాట్లు లేకుండా, పకడ్బందీగా పర్యటన కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదే శించారు. వారి వెంట అదనపు కలెక్టర్‌ పి.అమరేందర్‌, ఆర్డీవో బన్సీలాల్‌, అధికారులు ఉన్నారు.

పర్యటన సాగేదిలా...

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 18వ తేదీన ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలు దేరి, 10.15 గంటలకు జటప్రోలుకు చేరుకుంటారు. 10:30 గంటలకు అభివృద్ధి స్థలాల సందర్శన, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ సమీకృత గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 11:30 గంట లకు రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువకులతో ముఖాముఖి ఉంటుంది. మధ్యాహ్నం 12:15 గంటలకు ప్రభుత్వ సంక్షేమ ప్రాజెక్టులను పరిశీ లిస్తారు. ఒంటి గంటకు చిన్నంబావి మండల పరిధి లోని గ్రామంలోని తమ బంధువుల ఇంట్లో మధ్యాహ్న భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు జటప్రోలు గ్రామంలోని మదన గోపాలస్వామి ఆలయ పరిసరాల్లో నిర్వహించనున్న బహిరంగ సభా స్థలికి చేరుకుంటారు. 2:15 గంటలకు మంత్రి జూపల్లి, 3 గంటలకు ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు, షెడ్యూల్‌ కుదిరితే మీడియా సమావేశం నిర్వహిస్తారు. 4:30 గంటలకు హైదరాబాద్‌కు బయలు దేరి వెళ్తారు.

Updated Date - Jul 15 , 2025 | 11:53 PM