Share News

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:26 PM

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయ ణరెడ్డి అన్నారు.

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
విద్యార్థినులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి

- కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- కలెక్టర్‌తో కలిసి ఆశ్రమ పాఠశాల తనిఖీ

కల్వకుర్తి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయ ణరెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను గురువారం కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌తో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం, తరగ తి గదులు, వంటశాల తదితర విభాగాలను పరిశీలించారు. విద్యార్థు లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సిబ్బందిని ఆదే శించారు. తరగతి గదుల్లోని విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన వసతులను ప్ర భుత్వం సమకూరుస్తోంది. మీరు కష్టపడి చదువుకొని ఉత్తమ ఫలి తాలు సాధించాలని విద్యార్థినులకు సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులు అందిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. అనంతరం విద్యార్థినులతో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం కలెక్టర్‌ కల్వకుర్తి ఆర్డీవో కార్యాలయం, ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. భూభారతి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. సీజనల్‌ వ్యాధుల వ్యాప్తిని నియంత్రించేందుకు అవసరమైన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్‌ వెంట అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి యాదమ్మ, తహసీల్దార్‌ ఇబ్రహీం, కల్వకుర్తి మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 11:26 PM