ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN , Publish Date - Oct 16 , 2025 | 11:16 PM
ఉపాధి పనులపై సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే చర్య లు తప్పవని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు అ న్నారు.
- అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు
మానవపాడు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఉపాధి పనులపై సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే చర్య లు తప్పవని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు అ న్నారు. గురువారం మండలకేంద్రంలోని నర్సరీ, ఇంకుడు గుంతలను పరిశీలించారు. ప్రతీ గ్రా మంలో వేసవిలో ఉపాధి పనులు చేసేందుకు కూలీ ఎంతమంది వస్తారనే విషయంపై నివేది కలు తయారు చేయాలని, గ్రామాల్లో జాబ్‌కా ర్డులు ఉన్నవారికి తప్పనిసరిగా ఐరీష్‌తో ఫొటో లు తీసి పనులు కల్పించాలని సూచించారు. ఉపాధి పథకంలో ఎన్ని పనులు ఉన్నయానే విషయం రైతులకు, కూలీలకు తెలుపడంలో ని ర్లక్ష్యం చేయకూడదని, రోడ్లు, కాలువల పను లపై అంచనా వేసుకోవాలని సూచించారు. అ నంతరం చెన్నిపాడు గ్రామంలోని జిల్లా పరిష త్ పాఠశాలను పరిశీలించి విద్యార్థులకు భోజ నం ఏ విధంగా అందిస్తున్నరనే విషయంపై ఆరా తీశారు. నాణ్యమైన విద్యను పొంది ఉన్నతస్థాయికి ఎదుగాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్ర మంలో ఎంపీడీవో రాఘవ, పంచాయతీ కార్యద ర్శి సంధ్యారాణి తదితరులు ఉన్నారు.