రైతులకు యూరియా ఇబ్బంది కలిగిస్తే చర్యలు
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:31 PM
జిల్లాలో ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించవద్దని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.
- ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించరాదు
- సహకార సంఘాన్ని సందర్శించిన ఎస్పీ శ్రీనివాసరావు
గద్వాల క్రైం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించవద్దని, రైతులకు యూరియా ఇబ్బంది కలుగకుండా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంటారని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘాన్ని ఎస్పీ సందర్శించా రు. ఈ సందర్బంగా సహకార సంఘం దగ్గర రైతులకు యూరియా కోసం ఇస్తున్న టోకెన్స్ విధానాన్ని పరిశీలించారు. రైతులకు ఎరువులు సమయానికి అందేలా చూడాలని అక్కడి అఽధికారులకు సృష్ణంచేశారు. గోదాంలలో నిల్వఉంచి న ఎరువులను కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే పంపిణీ చేయాలన్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని యూరియాను సకాలంలో అందించాలన్నారు. రైతులు తమ అవసరం మేరకు మాత్రమే యూరియాను కొనుగోలు చేయాల్సిందిగా ఎస్పీ విజ్ఙప్తి చేశారు. జిల్లాలో యూరియా కృత్రిమ కొరత తలెత్తకుండా జాగ్ర త్త వహించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో రైతులకు ఇబ్బంది కలుగకుండా పోలీసు యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, చర్య లు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగులయ్య, గద్వాల పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్, వ్యవసాయశాఖ అధికారులు, పీఏసీఎస్ చైర్మన్ సుభాన్ ఉన్నారు.