గ్రామాల్లో పారిశుధ్యం నిర్వహించకపోతే చర్యలు
ABN , Publish Date - May 14 , 2025 | 10:59 PM
గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమం ప్రతీరోజు చేపట్టకపోతే కార్యదర్శి, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌రెడ్డి అన్నారు.
- నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి
- జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌రెడ్డి
ఊట్కూర్, మే 14 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమం ప్రతీరోజు చేపట్టకపోతే కార్యదర్శి, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చిన్నపొర్ల గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేసి, రికార్డులను పరిశీ లించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో జోన్‌లు విభజించి పరిశుభ్రత పనులు చేపట్టాలని అన్నారు. ప్రతీరోజు ప్రధాన రోడ్లతో పాటు, అంతర్గత రోడ్లను శుభ్రం చేయడంతో పాటు చెత్తను సేకరించాలన్నారు. గ్రా మంలో తాగునీటి సమస్య వస్తే వెంటనే పరి ష్కరించాలని సిబ్బందికి సూచించారు. మిషన్ భగీరథ నీరు సరిగ్గా రావడం లేదని చెప్పడంతో జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. రెండు ట్యాంకులకు సరిపడా నీరు వచ్చేలా చూడా లన్నారు. అనంతరం గ్రామంలోని ప్రధాన సెంటర్లలో తిరిగి కిరాణం, ఇతర షాపుల వారితో మాట్లాడి చెత్తను బుట్టలో వేసుకోవాలన్నారు. అనంతరం గ్రామంలోని నర్సరీని సందర్శించి, మొక్కలను పరిశీలించారు. ఈసీ మహిపాల్ రెడ్డి, టీఏ మనీషా, పంచాయతీ కార్యదర్శి గౌతమ్, కారోబార్ వెంకటప్ప తదితరులున్నారు.