Share News

రైతులను ఇబ్బంది పెడితే చర్యలు

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:24 PM

ధాన్యం కొ నుగోలు విషయంలో రైతు లను ఇబ్బంది పెడితే చర్య లు తప్పవని ఎమ్మెల్యే మేఘారెడ్డి హెచ్చరించారు.

రైతులను ఇబ్బంది పెడితే చర్యలు
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

- మిల్లర్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి : ఎమ్మెల్యే మేఘారెడ్డి

పెద్దమందడి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి):ధాన్యం కొ నుగోలు విషయంలో రైతు లను ఇబ్బంది పెడితే చర్య లు తప్పవని ఎమ్మెల్యే మేఘారెడ్డి హెచ్చరించారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని పామిరెడ్డి పల్లిలో ఏర్పాటు చేసిన కొ నుగోలు కేంద్రాన్ని శనివా రం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. మిల్లర్లపై అధి కారులు ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడ ఏలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కొనసాగించాలని సూచించా రు. కొనుగోలు కేంద్రం నుంచి రైతులు ధాన్యాన్ని లారీలలోకి ఎత్తిన తరువాత రైతులకు ఎలాంటి సంబంధం ఉండదని, ఏ సమస్య ఉన్నా కొనుగోలు కేంద్రంలోనే పరిష్కరించి ధాన్యాన్ని తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద పూర్తి స్థాయి వసతులు కల్పించాలని, రైతులను ఇబ్బందలకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కా ర్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కె ట్‌ యార్డు అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రమేష్‌గౌడ్‌, మాజీ ఎంపీపీ రఘుప్రసాద్‌, మాజీ సర్పంచు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 11:24 PM