Share News

అటవీ భూముల జోలికొస్తే చర్యలు

ABN , Publish Date - Nov 12 , 2025 | 11:33 PM

అటవీశాఖ పరిధిలోని భూముల జోలికొస్తే సహించేది లేదని, విధి నిర్వహణలో ఉన్న అటవీ ఉద్యోగులపై దాడులకు పాల్పడితే చర్యలు తప్పవని డీఎఫ్‌వో రోహిత్‌ గోపిడి హెచ్చరించారు.

అటవీ భూముల జోలికొస్తే చర్యలు
కొల్లాపూర్‌ మండలం ఒట్టిమానుకుంట అటవీ ప్రాంతంలో మొక్క నాటుతున్న డీఎఫ్‌వో రోహిత్‌ గోపిడి, చిత్రంలో అటవీశాఖ సిబ్బంది

- డీఎఫ్‌వో రోహిత్‌ గోపిడి

- అటవీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే కేసులు

- ఒట్టి మానుకుంట వద్ద రైతులు చదును చేసిన భూమిలో మొక్కలు నాటిన అధికారులు

కొల్లాపూర్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : అటవీశాఖ పరిధిలోని భూముల జోలికొస్తే సహించేది లేదని, విధి నిర్వహణలో ఉన్న అటవీ ఉద్యోగులపై దాడులకు పాల్పడితే చర్యలు తప్పవని డీఎఫ్‌వో రోహిత్‌ గోపిడి హెచ్చరించారు. మంగళవారం ముక్కిడిగుండం గ్రామ శివా రులో ఒట్టి మానుకుంట సమీపంలో రైతులు చదును చేసిన అటవీ స్థలంలో బుధవారం మొక్కలు నాటారు. ఈ సంద ర్భంగా డీఎఫ్‌వో మాట్లాడుతూ ఒట్టిమానుకుంట వద్ద భూమి చదును పనులను అడ్డుకోబోయిన అటవీ సిబ్బంది పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ముక్కిడి గుండం గ్రామంలో దాదాపు 200 మంది సిబ్బం దితో కవాతు నిర్వహించారు. ఆక్రమణ గురైన భూమిని స్వాధీనం చేసుకుని మొక్కలు నాటి అటవీ సిబ్బందికి మనోధైర్యం కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్‌డీవో చంద్రశేఖర్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ రామ్మోహన్‌, ఇతర అధికారు లు గురు ప్రసాద్‌, వీరేశ్‌, సుబాబ్‌, ఈశ్వర్‌, సెక్షన్‌ అధికారు లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 11:34 PM