మైనర్ల వివాహాలకు సహకరిస్తే చర్యలు
ABN , Publish Date - Aug 04 , 2025 | 11:38 PM
వనపర్తి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశా లలో సోమవారం జిల్లా న్యా య సేవాధికర సంస్థ ఆధ్వర్యం లో విద్యార్థులకు చట్టాలపై అ వగాహన సదస్సు నిర్వహించా రు.
అమరచింత, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : వనపర్తి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశా లలో సోమవారం జిల్లా న్యా య సేవాధికర సంస్థ ఆధ్వర్యం లో విద్యార్థులకు చట్టాలపై అ వగాహన సదస్సు నిర్వహించా రు. కార్యక్రమానికి జిల్లా న్యా య సేవ అధికార సంస్థ కార్య దర్శి సీనియర్ సివిల్ జడ్జి రజి ని హాజరై మాట్లాడుతూ... 18 సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లల అం గీకారంతోనే వివాహాలు జరిగినా.. అవి చట్టప రంగా చెల్లవన్నారు. మైనర్ల వివాహాలకు సహ కరించిన ప్రతీ ఒక్కరు శిక్షకు అర్హులవుతారని తెలియజేశారు. అదేవిధంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌ల గురించి వివరిస్తూ, అలాంటి ఘటనలు జరిగినప్పుడు సమయస్ఫూర్తితో ఏ విధంగా బయటపడాలో తెలియజేశారు. ఉచిత న్యాయ సలహాల కోసం 15100 టోల్ ఫ్రీ నెంబర్‌ను సం ప్రదించవచ్చని తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య పాల్గొన్నారు.