Share News

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

ABN , Publish Date - Dec 19 , 2025 | 11:33 PM

జోగుళాంబ గద్వాల జిల్లాలోని వైద్యసిబ్బంది, స్కానింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సంధ్యాకిరణ్మయి అన్నారు.

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

  • డీఎంహెచ్‌వో డాక్టర్‌ సంధ్యాకిరణ్మయి

గద్వాల న్యూటౌన్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లాలోని వైద్యసిబ్బంది, స్కానింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సంధ్యాకిరణ్మయి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కా ర్యాలయంలో గర్భస్థ పిండ నిర్ధారణ నిరోధక చట్టం 1994 అమలుపై జిల్లా సలహా కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో 22 స్కా నింగ్‌ సెంటర్లు ఉన్నాయని, వీటిపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. స్కానింగ్‌ సెంట ర్లు నిర్వహించే క్వాలిఫైడ్‌ డాక్టర్లు ప్రతినెల 5వ తేదీలోపు గర్భిణుల స్కానింగ్‌కు సంబంధించిన ఫారాలు ఇవ్వాలన్నారు. స్కానింగ్‌ సెంటర్‌ నిర్వహించే నిర్వాహకులు ఎవరైనా గర్బస్థ శిశువుగా ఉన్నప్పుడే లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించి పుట్టబోయేది ఆడ, మగ బిడ్డ అని తెలిపితే వారిపై పీసీపీఎన్‌డీటీ చట్ట ప్రకారం మూడు సంవత్సరాల జైలుశిక్ష, రూ.50వేల జరిమానా విధిస్తారన్నారు. ప్రతీ రెండు నెలలకు ఒకసారి సలహా కమిటీ మీటింగ్‌ నిర్వహిస్తామని, గర్భస్థ పిండ లింగనిర్ధారణ నిరోధక చట్టం గురించి కమిటీ మెంబర్లు అందరు ఫీల్డ్‌లెవెల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ దమయంతి, డాక్టర్‌ శిరీష, ప్రో గ్రాం అధికారి డాక్టర్‌ ప్రసూనారాణి, డిప్యూటీ డెమో మఽధుసూదన్‌రెడ్డి, జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారి నర్సింహ, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Dec 19 , 2025 | 11:33 PM