అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:10 PM
ప్రజాపాలన దినోత్సవంలో ప్రోటోకాల్ పాటించకుండా తమను అవ మానించిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలిశ్రీనివాసులు, అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డెప్ప ఆరోపించారు.
- కలెక్టరేట్ ముట్టడిలో జిల్లా గ్రంథాలయ, అలంపూర్ మార్కెట్‌యార్డ్ చైర్మన్లు
గద్వాల న్యూటౌన్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన దినోత్సవంలో ప్రోటోకాల్ పాటించకుండా తమను అవ మానించిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలిశ్రీనివాసులు, అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డెప్ప ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సెప్టెంబరు 17న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రతినిధి ఎ.పి. జితేందర్‌రెడ్డి కలెక్టరేట్‌లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఆ కార్య క్రమం సందర్భంగా కలెక్టర్ బీఎం సంతోష్ తో పాటు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రె డ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అదన పు కలెక్టర్లు, ఆర్డీవోతో పాటు గద్వాల మా ర్కెట్ కమిటీ చైర్మన్ కూడా వేదికపై కూ ర్చున్నారు. దీంతో మాకు ప్రోటోకాల్ లేదా అని కలెక్టర్‌ను అడిగేందుకు వెళ్లగా గద్వాల ఎమ్మెల్యే మాపై దుర్భాషలాడారన్నారు. అ లాగే అదనపు కలెక్టర్ సీసీ, కొందరు పోలీసులు మమ్మల్ని లాక్కేళ్లారని, వీరిపై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గద్వాల మార్కెట్ కమిటీ చైర్మన్ వే దికపై కూర్చోవడం మాకు కూడా సంతోషమేనని, ఎందుకంటే అతడు కూడా ఒక బీ సీ బిడ్డే అన్నారు. అయితే మాకు కూడా వే దికపై కూర్చోనివ్వకుండా కిందిస్ధాయిలో కూర్చోనివ్వడంతో మా మానోభావాలు దెబ్బతిన్నాయని, అందుకే కలెక్టర్‌ను అడిగేందు కు వచ్చామే తప్ప ఇందులో ఎలాంటి వేరే అభిప్రాయాలు లేవన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే, అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షెక్షావళి ఆచారి, ఎ స్సీ సెల్ నాయకులు మద్దిలేటి, ఎర్రవల్లి మాజీ సర్పంచు జోగుల రవి ఉన్నారు.