ఆ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:53 PM
సీఎంఆర్ పాత బకాయిలను చెల్లించని మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్టు కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధి కారులను ఆదేశించారు.
వనపర్తి రాజీవ్ చౌరస్తా, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : సీఎంఆర్ పాత బకాయిలను చెల్లించని మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్టు కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధి కారులను ఆదేశించారు. ఆదివారం అంబేడ్కర్ సచివాలయం హైదరాబాదులో సీఎంఆర్ బకాయిలపై వనపర్తి జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వనపర్తి జిల్లా ఏర్పడినప్పటి నుం చి ఇప్పటి వరకు ఎంత ధాన్యం సేకరించారు.? జిల్లాల వారీగా మిల్లర్ల నుంచి రావాల్సిన పాత బకాయిలు తదితర వివరాలను తెలుసుకున్నారు. ఇంకా మిల్లర్ల నుంచి సీఎమ్మార్ బియ్యం రావాల్సి ఉందని మంత్రికి డీఎం జగన్మోహన్ తెలిపారు. వనపర్తి జిల్లాలో మొత్తం 180 రైస్ మిల్లులు ఉండగా, 168 రా రైస్ మిల్లులు, 12 బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయన్నారు. 29 మిల్లుల యజ మానులపై క్రిమినల్ కేసులు నమోదు కాగా, 5 మిల్లుల యజమానులపై ఆర్‌ఆర్ యాక్టు కింద కేసులు నమోదు చేసినట్లు వివరించారు. సీఎంఆర్ బ కాయిల సేకరణలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని మంత్రి అధికారులకు తెలి పారు. సీఎంఆర్ అప్పగించని మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. ఆర్‌ఆర్ యాక్ట్ కింద ఆస్తులు జప్తునకు చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ కీమ్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్, డీఎస్సీ వెంకటేశ్వర్లు, డీఎస్‌వో, అసిస్టెంట్ మేనేజర్ పాల్గొన్నారు.