కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:41 PM
ఆలయానికి సంబంధిం చి ఇమాం భూమిని కబ్జా చేసుకుని ప్లాట్లుగా మార్చేందుకు యత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్‌కుమార్ డిమాండ్ చేశారు.
ఎన్‌హెచ్‌పీఎస్ జిల్లా చైర్మన్ రంజిత్‌కుమార్
ఆలయ ఇనాం భూమిని కాపాడాలని గ్రామస్థుల ఆందోళన
ధరూరు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆలయానికి సంబంధిం చి ఇమాం భూమిని కబ్జా చేసుకుని ప్లాట్లుగా మార్చేందుకు యత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్‌కుమార్ డిమాండ్ చేశారు. నీలహళ్లి గ్రామంలో నాయ కుల అండదండలతో ఆంజనేయస్వామి ఆలయ ఇనాం భూమి ఆక్రమణకు గురైందని, వెంటనే కబ్జాకు గురైన భూమిని కాపాడాలని మంగళ వారం గ్రామస్థులు ఆందోళన చేశారు. కబ్జాకు గురైన ఆలయ భూమిని మండల నాయకులు, గ్రామస్థులతో కలిసి రంజిత్‌కుమార్ పరిశీలించా రు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడిన రంజిత్‌కుమార్, గ్రామంలో 335 సర్వే నెంబ ర్‌లోని ఐదు ఎకరాల 16గుంటల ఇనాం భూమి ని 1963 నుంచి దేవాలయం భూమిగా కొనసా గుతుందన్నారు. ఆ స్థలాన్ని ఇరువర్గాల రాజకీయ పార్టీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారు స్తూ కబ్జాకు పాల్పడటమే కాగా గ్రామస్థులను నయవంచనకు గురిచేస్తూ అన్యాయానికి ఒడిగ ట్టారని ధ్వజమెత్తారు. ఎవరైతే ఆంజనేయస్వా మి దేవస్థానానికి పూజారిగా సేవ చేస్తారో, వా రు ఈ భూమిలో ఉపాధికి వ్యవసాయం చేసు కునే అవకాశం ఉందన్నారు. గత 25 సంవత్స రాలకు పైగా ఈ భూమిపైకి ఎవరూ రాలేదని, ఇదే తరుణంలో రాజకీయ నాయకులు ఏకమై కుట్రకు పాల్పడి ఇనాం భూమిలో రాత్రికిరాత్రే కంప పొదలను తొలగించి చదును చేసి ఆక్రమ ణకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇనాం భూమి కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కొంతమంది భూ కబ్జాదారులు సంబంధంలేని కిష్టాచారి అనే వ్యక్తిపై గ్రామానికి సంబంధించి ఇనాం భూమిని దత్తపుత్రుడిగా చిత్రీకరించి కొత్త నాటకానికి తెరతీస్తూ భూ కబ్జాదారులక కిష్టాచారిపై రిజిస్ర్టేషన్ చేయడం అన్యాయమని అన్నారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.