Share News

ఎన్నికల అధికారిపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Dec 15 , 2025 | 11:38 PM

ఎన్ని కల నిర్వహణ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం తూముకుంట గ్రామా నికి చెందిన కొంతమంది వ్యక్తులు పిర్యాదు చేశారు.

ఎన్నికల అధికారిపై చర్యలు తీసుకోవాలి

  • ఎంపీడీవోకు తూముకుంట గ్రామస్థుల ఫిర్యాదు

అయిజ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఎన్ని కల నిర్వహణ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం తూముకుంట గ్రామా నికి చెందిన కొంతమంది వ్యక్తులు పిర్యాదు చేశారు. మండలంలోని తూముకుంట గ్రామ పంచాయతీ సర్పంచు ఎన్నికల సమయంలో ఎన్నికల నిర్వహణ అధికారి అయిన రిటర్నింగ్‌ అధికారి, ఆర్‌ఓ, శిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మాకు నష్టం జరిగిందని ఫిర్యాదు చేశారు. అ భ్యర్థులమైన మా సంతకాలు లేకుండా డిక్లరేష న్‌ చేయటము చట్టాన్ని అవమానించటమే అ న్నారు. వెంటనే సంబంధిత అధికారులపై చ ర్యలు తీసుకోవాలని, రీపోలింగ్‌ నిర్వహించాలని కోరుతూ ఎంపీడీఓ భాస్కర్‌కు వినతిపత్రం అం దజేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతా మని చెప్పారు. ఫిర్యాదుచేసిన వారిలో క్యాసా రం, ఏసురాజు, సురేందర్‌, శేకర్‌, ఆంజనేయులు ఉన్నారు.

Updated Date - Dec 15 , 2025 | 11:38 PM