ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Mar 16 , 2025 | 11:10 PM
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు.

- కాంగ్రెస్ డిమాండ్
- పార్టీ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం
నారాయణపేటటౌన్/మద్దూర్/కొత్తపల్లి/కోస్గి/మరికల్/దామరగిద్ద/ధన్వాడ, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నారాయణపేట మండల అధ్యక్షుడు శివారెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ.సలీం ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే వెంటనే స్పీకర్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూత్ కాం గ్రెస్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు మహేష్, సతీష్‌గౌడ్, రమేష్, సూర్యకాంత్, ఆర్టీఏ బోర్డు మెంబర్ సోషల్ రాజేష్, మార్కెట్ డైరెక్టర్ బోయ శరణప్ప, మహిముద్, ఖురేషి, యూసుఫ్‌తాజ్ తదితరులున్నారు.
అదేవిధంగా, మద్దూర్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకో, ధర్నా చేశారు. స్థానిక పాత బస్టాండ్ చౌరస్తాలో చేపట్టిన ఆందోళన కార్యక్ర మంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు వీరేష్‌గౌడ్, గుత్తి పురుషోతం, శ్రీనివాస్, బాల్‌చెందర్, మల్లికార్జున్ జంగం బాబు, రవీందర్‌రెడ్డి, లక్ష్మప్ప, లక్ష్మణ్‌నాయక్ తదితరులున్నారు.
కొత్తపల్లి మండల చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ మం డల అధ్యక్షుడు కోట్ల మహీందర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, నరేష్‌యాదవ్, తిరుపతిరెడ్డి, రఘుపతిరెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు.
కోస్గిలోని శివాజీ చౌరస్తాలో జగదీశ్‌రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్దన్‌రెడ్డి, మునిసిపల్ అధ్యక్షుడు బెజ్జు రాములు, పట్టణ అధ్యక్షుడు తుడుం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిప్రసాద్‌రెడ్డి, నాయకుడు అన్నకిష్టప్ప తదితరులున్నారు.
మరికల్‌లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరన్న ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఇందిరాగాంఽధీ చౌరస్తాలో కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, హరీశ్‌రావు దిష్టిబొమ్మలు దహనం చేశారు. కార్యక్రమంలో సూర్యచంద్ర ఫౌండేషన్ అఽధినేత సూర్యమోహన్‌రెడ్డి, హరీశ్‌కుమార్, ఎల్.రాము లు, అంజిరెడ్డి, టైషన్ రఘు, ఆంజనేయులు, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తదితరులున్నారు.
దామరగిద్దలోని అంబేడ్కర్ చౌరస్తాలో బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్, ఖాజా, కనికరెడ్డి, అశోక్‌గౌడ్, ఓబీసీ మండల అధ్యక్షుడు శివకుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు రంజిత్, శరత్ తదితరులు పాల్గొన్నారు.
ధన్వాడలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను అవమానించిన కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పోలీసులకు ఫిర్యాదు
కోస్గి రూరల్ : అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ గుండుమాల్ మండల నాయకులు ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతకుముందు వారు మండల కేంద్రంలో దళిత సంఘాల నాయకులతో కలిసి బీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి తదితరులున్నారు.