Share News

డీఈవోపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Jun 25 , 2025 | 11:26 PM

అక్రమాలకు పాల్పడుతున్న డీ ఈవోపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐ ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఏవో శంకర్‌కు వినతిపత్రం సమర్పించారు.

డీఈవోపై చర్యలు తీసుకోవాలి
కలెక్టరేట్‌ ఏవో శంకర్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

కలెక్టరేట్‌ ఏవోకు వినతి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): అక్రమాలకు పాల్పడుతున్న డీ ఈవోపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐ ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఏవో శంకర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సంద ర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఇటీవల ఏ సీబీకి పట్టుబడ్డ మాజీ డీఈవో రవీందర్‌ భార్య కు మారుమూల తండాకు బదిలీ కాగా అక్కడ విధులు నిర్వహించాల్సి ఉండగా, ఆమెకు పట్ట ణంలోని ఇంటికి సమీపంలో పాఠశాలకు డిప్యూ టేషన్‌ ఇచ్చారని ఆరోపించారు. తన పరిధిలోని ఒక కాంప్లెక్స్‌ హెచ్‌ఎంను బెదిరించి అక్రమా లకు పాల్పడుతన్నారని పేర్కొన్నారు. కార్యాల యంలో విధులు నిర్వహించే అధికారులు అక్ర మాలకు పాల్పడుతున్న డీఈవో సంబంధం లే నట్లు వ్యహరిస్తున్నారని ఆరోపించారు. డీఈవో అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసు కోవాలని కోరారు.

Updated Date - Jun 25 , 2025 | 11:26 PM