Share News

బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

ABN , Publish Date - Sep 22 , 2025 | 11:48 PM

ప్రజావాణి సమస్యలను త్వరగా పరిష్కరించే లా ప్రతి పోలీస్‌ అధికారి కృషి చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.

బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
ప్రజావాణిలో ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న కలెక్టరేట్‌ ఏవో భూపాల్‌రెడ్డి

గద్వాల క్రైం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి సమస్యలను త్వరగా పరిష్కరించే లా ప్రతి పోలీస్‌ అధికారి కృషి చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని నలుమూలల నుం చి 16 ఫిర్యాదులు రాగా నేరుగా ఫిర్యాదుదారులతో మాట్లాడి ఎస్పీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.

  • కలెక్టరేట్‌ ప్రజావాణికి 41 ఫిర్యాదులు

గద్వాల న్యూటౌన్‌: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ సంతోష్‌ అధికారుల ను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 41 ఫిర్యాదులు అందాయి. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పు డు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వర మే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమం లో వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Updated Date - Sep 22 , 2025 | 11:48 PM