Share News

ఐక్యపోరాటాలతోనే హక్కుల సాధన

ABN , Publish Date - Jul 09 , 2025 | 11:29 PM

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో బుధవారం వివిధ రంగాల కార్మికులు భారీగా పాల్గొన్నారు.

ఐక్యపోరాటాలతోనే హక్కుల సాధన

- జోగుళాంబ గద్వాల జిల్లాలో కార్మిక సంఘాల ర్యాలీలు

వడ్డేపల్లి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో బుధవారం వివిధ రంగాల కార్మికులు భారీగా పాల్గొన్నారు. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులు, చ ట్టాలను కాలరాసే విధంగా నిర్ణయాలు తీసుకుం టున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఐక్యపోరాటా ల ద్వారా మెడలు వంచి బుద్ధి ్దచెబుతామని ఈ సందర్భంగా సీఐటీయూ జోగుళాంబ గద్వాల జిల్లా జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు. బుధవారం శాంతినగర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనం తరం సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ కేంద్ర కార్మికులకు నష్టం వాటిల్లే విధంగా నాలుగు లేబర్‌ కోడ్‌లను తెచ్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాల ను మార్చారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ తెచ్చిన జీవో 282ను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. కార్మికు ల శ్రమదోపిడీని చేసేందుకు తెచ్చిన లేబర్‌ కో డ్‌లను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు. సభలో సీఐటీయూ వడ్డేపల్లి, రాజోలి మండలాల కార్యదర్శులు సం జీవరాజు, లక్ష్మన్న, కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు పరంజ్యోతి, జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్‌, విజయ్‌ కుమార్‌, హమాలీ యూనియన్‌ నాయకులు భీ మన్న, అంగన్‌వాడీ, ఆశావర్కర్స్‌ గ్రామపంచా యతీ, మునిసిపల్‌ వర్కర్ల, హమాలీ యూని యన్‌ల నాయకులు పాల్గొని మాట్లాడారు. అ నంతరం ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి ఆశన్న పాటలు పాడి కార్మికులను చైతన్య పరి చారు. అంతకుముందు శాంతినగర్‌ సెంటర్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు నాయ కులు, కార్మికులు ర్యాలీ నిర్వహించి, వడ్డేపల్లి తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్ర మంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు సలోమి, ఆదిలక్ష్మి, లక్ష్యి, జోష్ణ, శాంతమ్మ, ఆశ యూనియన్‌ నాయకులు అనసూయమ్మ, మమ త, సుజాత, పద్మ, రేణుక, మునిసిపల్‌ యూని యన్‌ నాయకులు మధు, దావీదు, గ్రామపంచా యతీ యూనియన్‌ నాయకులు దొడ్ల లక్ష్మమ్మ, మహేష్‌, రవి, ఉమాదేవి, హమాలీ యూనియ న్‌ నాయకులు వేణు, మధు, యుగంధర్‌, కేవీ పీఎస్‌ నాయకులు మధు, దినకర్‌, బుచ్చన్న, రాజు, వడ్డేపల్లి, రాజోలి, మానవపాడు మండలా లకు నుంచి వివిధ రంగాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇన్సూరెన్స్‌ రంగ ప్రైవేటీకరణ వద్దు

గద్వాల న్యూటౌన్‌ : ఇన్సూరెన్స్‌ రంగ ప్రైవేటీకరణ ఆలోచనను ప్రభుత్వం వీడాలని గద్వాల జిల్లా ఎల్‌ఐసీ బ్రాంచ్‌ ప్రధాన కార్యదర్శి బంగి రంగారావు అన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో భాగంగా బుధవారం గద్వాల ఎల్‌ఐసీ కార్యాలయంలో ఉద్యోగులు సమ్మెను నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీఈయూ అధ్యక్షుడు సూరజ్‌, ఉపాధ్యక్షుడు శివశంకర్‌, ఉద్యోగులు రాఘవేం ద్ర, మల్లికార్జున్‌, రంగయ్య, ప్రవీణ్‌కుమార్‌, చైతన్య, నర్సింగ్‌, మనీష్‌, సుదర్శన్‌శెట్టి, శైలేష్‌, పద్మ తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 11:29 PM