Share News

పక్కాగా లెక్కలు .. చెప్పకపోతే చిక్కులు

ABN , Publish Date - Dec 08 , 2025 | 11:16 PM

గ్రామ పంచాయతీ ఎన్నిక ల్లో సర్పంచు, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తాము ఖర్చు వివరాలను పూర్తి గా, పక్కాగా నమోదు చేయాల్సి ఉంటుంది.

పక్కాగా లెక్కలు .. చెప్పకపోతే చిక్కులు

- ఎన్నికల ఖర్చులను సక్రమంగా నమోదు చేయాలి

- 45 రోజుల్లోగా ఎంపీడీవోలకు అందించాలి

- గెలిచినా, ఓడినా అభ్యర్థులపై తప్పని చర్యలు

- ఎన్నికల్లో పోటీకి 3 ఏళ్ల పాటు అనర్హత

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీ ఎన్నిక ల్లో సర్పంచు, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తాము ఖర్చు వివరాలను పూర్తి గా, పక్కాగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలను ఎన్నికల అనంతరం 45 రోజు ల్లోగా ఎంపీడీవోలకు అందించాల్సి ఉంటుం ది. గెలిచినా, ఓడిపోయినా ఈ వివరాలను సమర్పించడం తప్పనిసరి. ఖర్చుల వివరా లను సమర్పించకపోతే, సదరు అభ్యర్థి గెలి చినా, ఓడినా రాష్ట్ర ఎన్నికల సంఘం నిబం ధనల మేరకు చర్యలు తీసుకుంటారు. గెలిచి న అభ్యర్థులపై అనర్హత, ఇతర చర్యలు తీసు కునేందుకు ఎంపీడీవోల సిపార్సు మేరకు డీపీవో కలెక్టర్‌కు నివేదిక పంపుతారు. వారి నుంచి వచ్చిన వివరణ మేరకు కలెక్టర్‌ చర్య లు తీసుకుంటారు. అలాగే ఓడిపోయిన సర్పంచు, వార్డు మెంబర్లు ఏ ఇతర ఎన్నిక ల్లోనూ పోటీ చేయకుండా వారిపై అనర్హత వేటు వేయనున్నారు.

జనాభాను బట్టి ఎన్నికల ఖర్చు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఎంత ఖర్చు చేయవచ్చో ఎన్నికల వ్యయ పరిశీలకులు నిర్ణయిస్తారు. జనాభా 5 వేల కంటే ఎక్కువగా ఉన్న గ్రామ పంచాయతీ లలో సర్పంచు అభ్యర్థి రూ 2.50 లక్షల వరకు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. వార్డు సభ్యుడి స్థానానికి రూ. 50 వేలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. చిన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచు అభ్యర్థికి రూ. 1.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ. 30 వేలు ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుం ది. అభ్యర్థులు తాము చేస్తున్న ఖర్చులను రోజు వారీగా నమోదు చేయాల్సి ఉంటుంది. దేనికి ఎంత ఖర్చు చేశారో పక్కాగా రాయా ల్సి ఉంటుంది. ఎన్నికల అనంతరం ఈ వివ రాలను సంబధిత ఎంపిడీవోలకు 45 రోజు ల్లోగా అందించాల్సి ఉంటుంది. లేకపోతే అధికారులు చర్యలు తీసుకుంటారు.

2019లో 500 మందిపై అనర్హత

నారాయణపేట, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు, 2019లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అనంతరం 2019, ఫిబ్రవరి 17లో అప్పటి సీఎం కేసీఆర్‌ తన జన్మదినం సంబర్భంగా నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు మొత్తం 721 గ్రామాలకు గాను బండమీదిపల్లి, శంకరాయి పల్లి గ్రామాలకు ఎన్నికలు నిర్వహించలేదు. 719 గ్రామాలకు, 6,825 వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగాయి. అందులో 500 మంది వార్డు సభ్యులు, 25 మంది సర్పంచులు ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించలేదు. దీంతో వారు 3 ఏళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా అనర్హత వేటు వేశారు. ఈ సారి ఎన్నికల్లో ఎంత మంది అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వివరాలను అందించారో ఎన్నికల అనంతరం తెలుస్తుంది.

Updated Date - Dec 08 , 2025 | 11:17 PM