Share News

జాతీయ రహదారిపై ప్రమాదాలు నివారించాలి

ABN , Publish Date - Nov 13 , 2025 | 11:11 PM

కోదండాపురం పోలీసు స్టేషన్‌ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు.

జాతీయ రహదారిపై ప్రమాదాలు నివారించాలి
కోదండాపురం పోలీసు స్టేషన్‌ పరిసరాలను పరిశీలిస్తున్న ఎస్పీ శ్రీనివాసరావు

  • కోదండాపురం పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ శ్రీనివాసరావు

ఎర్రవల్లి నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): కోదండాపురం పోలీసు స్టేషన్‌ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. కోదండాపురం పోలీసు స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. పలు రికార్డులను, స్టేషన్‌ ఆవరణను పరిశీలిం చారు. స్టేషనుకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, ప్రతీ కేసులో నాణ్యమైన దర్యాప్తు చేయాలని, సైబర్‌ నేరాల నివారణకు కమ్యూనిటీ పోలీసింగ్‌ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించి దొంగతనాలకు చెక్‌ పెట్టాలని చెప్పారు. నేషనల్‌ హైవేపై ప్రమాదాలు జరగకుండా బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తించి రాత్రివేళల్లో రోడ్డు పక్కన వాహనాలు నిలిపి నిద్రించే డ్రైవర్లకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలన్నారు. రోడ్‌ సేఫీ కోసం ఏర్పాటు చేసే విలేజ్‌ రోడ్‌ సేఫ్టీ కమిటీలు చురుగ్గా పని చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శంకర్‌, డీఎస్పీ మొగులయ్య, సీఐ రవిబాబు, ఎస్‌ఐ మురళి పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 11:11 PM